manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 1:00 pm Editor : Mana Praja Prathinidhi

శాంతి భద్రతలకు మరింత బలం

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్26
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుపతిలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక వసతులతో నిర్మించిన ఈ డీపీఓ భవనం జిల్లా స్థాయిలో శాంతి భద్రతల నిర్వహణను మరింత సమర్థవంతం చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొని, ప్రజల రక్షణకు మరింత బలమైన మౌలిక వసతులు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పోలీస్ శాఖ పనితీరును ఆధునీకరించే దిశగా ఈ డీపీఓ భవనం ఒక కీలక ముందడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి అనగాని సత్యప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన డీపీఓ కార్యాలయం ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు, శాంతిభద్రతల పరిరక్షణ మరింత పటిష్టంగా అమలవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.