manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 8:55 am Posted by : Mana Praja Prathinidhi

గ్రామాభివృద్ధేలక్ష్యంగాఉప్పలపుశివకుమార్‌కుమరోసారిఅవకాశంఇవ్వండి

మనప్రజాప్రతినిధి//మెదక్.డిసెంబర్13
చందంపేటగ్రామ అభివృద్ధి,ప్రజలసంక్షేమమేధ్యేయంగానిరంతరం పనిచేస్తానని ఉప్పలపు శివకుమార్ గారు అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.గ్రామంలోని విద్య, ఆరోగ్యం, పేదల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. గ్రామం లోని జడ్పిహెచ్ఎస్ హైస్కూల్‌లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం, నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడ తామని పేర్కొన్నారు. అలాగే పేద కుటుంబాల్లో జరిగే వివాహాలకు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఆర్థిక సహకారం అందిస్తామని తెలిపారు.అదేవిధంగా గత కాలంలో రెండు దఫాలు ఎంపిటీసీగాఎన్నికై, తన పదవీకాలంలో ప్రభుత్వ సహకారంతో పాటు తన సొంత ఖర్చులతో కూడా గ్రామంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు గుర్తు చేశారు. విద్య, ఆరోగ్యం, శుభ్రత, తాగునీరు, వీధి దీపాలు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేశానని చెప్పారు.తనకు ఉన్న గత పాలన అనుభవం వల్ల గ్రామంలో అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇంకొకసారి అవకాశం ఇస్తే, ఆ అనుభవాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపే నాయకుడిగా పనిచేస్తానని తెలిపారు.గ్రామ భవిష్యత్తు, అభివృద్ధి కోసం తనను ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఉప్పలపు శివకుమార్ గారు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.