మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండలం.డిసెంబర్ 31
చేగుంట మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన కంచర్ల సిద్దగౌడ్ గౌడ సంఘం మండల ప్రధాన కార్యదర్శి, గౌడ జన హక్కుల పోరాట సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా సిద్దగౌడ్ మాట్లాడుతూ గౌడల హక్కుల సాధన కోసం అవసరమైతే ముఖ్యమంత్రి వద్దకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గౌడ సమాజానికి సంబంధించిన న్యాయమైన హక్కులు సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.నూతన సర్పంచ్‌లకు ఘన సన్మానంమెదక్ జిల్లాలో గౌడ జన హక్కుల పోరాట సమితి – మోకు దెబ్బ ఆధ్వర్యంలో గౌడ నూతన సర్పంచ్‌లను పూల శాలువాల తో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలోనర్సింగ్ మండల సర్పంచ్‌గా ఆకుల సుజాత మల్లేశం గౌడ్‌ను,నర్సింగ్ మండలం నర్సంపల్లి గ్రామ సర్పంచ్‌గా రాజేశ్వర్ గౌడ్ భాగ్యలక్ష్మిని, రామాయం పేట మండలం ప్రగతి ధర్మారం గ్రామ సర్పంచ్‌గా బండారి శ్రీనివాస్ గౌడ్‌ను,బండారి మహేందర్ గౌడ్‌ను సన్మానించారు.పాల్గొన్న నాయకులుఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండాపురం బాలరాజు గౌడ్, రాష్ట్ర కార్యదర్శి బుచ్చనగారి కిషన్ గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సింగీతం నర్సా గౌడ్, జిల్లా అధ్యక్షుడు ఆకుల మల్లేశం గౌడ్ పాల్గొన్నారు.
అలాగే చేగుంట మండల ప్రధాన కార్యదర్శి కంచర్ల సిద్ధిరాములు గౌడ్, ముచర్ల స్వామి గౌడ్, గౌడ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి బుచ్చనగారి భాగ్యలక్ష్మి గౌడ్, జిల్లా అధ్యక్షురాలు కాసులాబాద్ సిద్ధమ్మ గౌడ్, బూడిద స్వరూప గౌడ్, జిల్లా కార్యదర్శి కర్రే విజయ గౌడ్, జిల్లా కోశాధికారి తీగల నవనీత గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యురాలు సంగీత గౌడ్ తదితరులు పాల్గొన్నారు.