అక్బర్‌పేటనుఆదర్శగ్రామంగాతీర్చిదిద్దుతానుసర్పంచ్ అభ్యర్థి కూతురు కుమార స్వామి
అక్బర్ పేటభూంపల్లి మండలం, దుబ్బాక నియోజకవర్గం (మనప్రజాప్రతినిధి)డిసెంబర్10అక్బర్ పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్న కూతురు కుమార స్వామి బుధవారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలతో మాట్లాడుతూ అక్బర్ పేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా నిలపడం తన లక్ష్యమని తెలిపారు.గ్రామంలో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని తెలిపారు. అధికారులతో చర్చించి ప్రతి సమస్య పరిష్కారం దిశగా కృషి...