manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 10:55 am Editor : Mana Praja Prathinidhi

జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపు
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబరు 01
జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీస్ యాక్ట్–1861ను ఈ నెల మొత్తం అమలులో ఉంచుతున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఈ యాక్ట్ విధులు కొనసాగుతాయని తెలిపారు.
ఎస్పీ మహేష్ గారు వివరించిన ప్రకారం—పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన ధర్నాలు, రాస్తారోకోాలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా డీజే వినియోగం పూర్తిగా నిషేధితమని తెలిపారు.
ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, ప్రభుత్వ ఆస్తులను దెబ్బతీయే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. జిల్లాలోశాంతి,సౌహార్దవాతావరణంకొనసాగేందుకుప్రజలుపోలీసులకు పూర్తిగా సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.