manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 1:25 pm Posted by : Mana Praja Prathinidhi

విధి కర్తవ్యమేనా? ఓటు హక్కేనా?రెండు కావాలంటేప్రత్యేకసెలవుఅవసరం!”

సిద్దిపేటజిల్లా. మనప్రజాప్రతినిధి//డిసెంబర్ 11సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా స్పెషల్ క్యాజువల్ లీవ్‌ (ఎస్‌సీఎల్‌) మంజూరు చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం (జీఏఎల్‌ఏ) జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల విధుల్లో నిమగ్నమవుతుండ డంతో అనేక మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉన్న గ్రామాలు చాలా తక్కువగా ఉండటం వల్ల తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేయాలనుకునే ఉద్యోగులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఎన్నికల విధుల్లో లేని ఉద్యోగుల కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశమివ్వా లంటే  ప్రత్యేక సెలవు అనివార్యమని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ప్రభుత్వమే ఈ బాధ్యతను తీసుకోవాలని పేర్కొ న్నారు.అంతర జిల్లాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అందరికీ ఎస్‌సీఎల్‌ను మంజూ రుచేయాలంటూవిన్నవించారు.కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనక చంద్రం, అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.