manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 12:41 pm Posted by : Mana Praja Prathinidhi

గెలుపే కాదు… గమ్యానికి దారి చూపాలి

మాల సామాజిక వర్గ రాజకీయ ఎదుగుదలకు ఇది ఆరంభం
మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్26
ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించి సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కించుకున్న మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులను మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఇల్లంతకుంట సర్పంచ్ పీఠాన్ని అధిష్టించిన మామిడి రాజుతో పాటు, తాళ్లపెల్లి ఉప సర్పంచ్ ఎలుక రామస్వామి, రేపాక ఉప సర్పంచ్ కోదాని మహేష్, ముస్కాన్‌పేట్ ఉప సర్పంచ్ దాసరి లావణ్య శ్రీనివాస్‌లను శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయితీ కార్యాలయం వద్ద శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మేడి అంజయ్య మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి చెందిన నాయకులు ప్రజల మద్దతుతో గెలుపొందడం చారిత్రక పరిణామమని అన్నారు. ఇది కేవలం పదవుల గెలుపు మాత్రమే కాకుండా, రాబోయే రోజుల్లో మాల సామాజిక వర్గ రాజకీయ బలోపేతానికి బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నేటి రాజకీయాల్లో మన పతాకాన్ని ఎగరవేసి గెలిచిన మామిడి రాజు సహా ఇతర ప్రజాప్రతినిధులను యువత ఆదర్శంగా తీసుకుని, గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు మాల సామాజిక వర్గ రాజకీయ ఉనికిని మరింత బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు నిబద్ధతతో పనిచేస్తూ, అభివృద్ధి–సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు రాష్ట్ర నాయకులు దామెర సత్యం, జిల్లా అధ్యక్షులు నీరటి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గూడ బాబు, నీరటి కిరణ్ కుమార్, దామెర నర్సయ్య, సొల్లు కనకయ్య తదితర మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.