ప్రజలగుండెలనుంచిగాంధీనితొలగించడంఎవరివల్లా కాదు-కాంగ్రెస్ ఉగ్రనిరసన
MNREGS నుంచి గాంధీ పేరు తొలగింపుపై శ్రీకాళహస్తిలో నల్ల రిబ్బన్లతో ఆందోళన
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తిమండలం.డిసెంబర్19
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGS) నుండి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది.
శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి నాయకత్వంలో, పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా డీసీసీఅధ్యక్షులు బాలగురవం బాబు సారథ్యం వహించారు.“గాంధీని చరిత్ర నుంచే కాదు… ప్రజల హృదయాల నుంచీ ఎవ్వరూ తీసేయలేరు”-బాలగురవం బాబు
డీసీసీఅధ్యక్షులుబాలగురవంబాబుమాట్లాడుతూ,
“ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలతో దేశాన్ని కదిలించిన జాతిపిత గాంధీని ఈ దేశ ప్రజల మనసుల నుంచి తొలగించడం అసాధ్యం. స్వాతంత్ర్య సమరంలో సర్వస్వం త్యాగం చేసిన మహానేతను అవమానించడం దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే” అని మండిపడ్డారు.ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రజా ఉద్యమాలతో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.“గాంధీ పేరు తొలగించడం కాదు… దేశ ఆత్మను గాయపరచడం”తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ,“అహింస,శాంతి సందేశాలను ప్రపంచానికి చాటిన దార్శినికుడు మహాత్మా గాంధీ. భారతదేశాన్ని ప్రపంచ పటంపై నిలిపిన మహానుభావుడు. అలాంటి జాతిపిత పేరును ప్రభుత్వ పథకాల నుంచి తొలగించడం యావత్ భారతదేశ ప్రజల మనోభావాలను గాయపరచడమే” అని తీవ్రంగా ఖండించారు.రాబోయే రోజుల్లో గాంధీ చిత్రాన్ని కరెన్సీ నుంచి కూడా తొలగిస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నేతల ఏకస్వర నిరసనఈ నిరసన కార్యక్రమంలో
🔹 శ్రీకాళహస్తిమండలకాంగ్రెస్ అధ్యక్షులుసురేంద్ర రెడ్డి,
🔹 రేణిగుంటమండల ధ్యక్షులురాహుల్ రాయల్,
🔹 శ్రీకాళహస్తిమండలయువజనఅధ్యక్షులునవీన్,
🔹 రేణిగుంటమండలయువజనఅధ్యక్షులుఆసిఫ్,
🔹 నాగరాజు,అల్లావుద్దీన్,చరణ్ తదితరకాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించారు.