manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 3:46 am Posted by : Mana Praja Prathinidhi

దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో తిరుమలదర్శనంజనసేనహామీ

మనప్రజాప్రతినిది//తిరుపతి//డిసెంబర్7
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి దివ్యాంగులకు ఆన్‌లైన్ విధానం తొలగించి ఆఫ్‌లైన్ విధానంలో దర్శనం కల్పిస్తామని జనసేన పార్టీ హామీ ఇచ్చింది.తిరుపతి కలెక్టరేట్‌లో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కార్యక్రమంలో ఈ కీలక ప్రకటన జరిగింది.
ఏపీ దివ్యాంగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్, దివ్యాంగులకు రోజుకు కనీసం ఒక్కసారి ఆఫ్‌లైన్ దర్శనం కల్పించా లనిడిమాండ్ చేయగా.దీనిపై స్పందించిన జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్,ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి రోజుకు రెండు సార్లు ఆఫ్‌లైన్ దర్శనం కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలోవేదికపై ప్రసంగించిన పసుపులేటి హరిప్రసాద్ జిల్లాకలెక్టర్ డా. శ్రీ వెంకటేశ్వరజ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు.