తిమ్మానగర్ 2వ వార్డు నుంచి కంబాల పోచమ్మ నామినేషన్ – గౌను గుర్తుకు క్రమసంఖ్య 1
మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్11తిమ్మానగర్ గ్రామంలోని 2వ వార్డు సభ్యురాలిగా కంబాల పోచమ్మ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్‌లో క్రమసంఖ్య 1గా “గౌను గుర్తును” అధికారికంగా కేటాయించింది.ఈ సందర్భంగా కంబాల పోచమ్మ మాట్లాడుతూ“ప్రజలు నాపై ఉంచిన విశ్వాసం ఎంతో గొప్పది.నేను గెలిచి అవకాశం దక్కితే వార్డు అభివృద్ధికి అహర్నిశలు కష్టపడే సేవకురాలిగా పనిచేస్తాను.మన 2వ వార్డులో ఉన్న డ్రైనేజీ, పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలు ఏవైనావాటిని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ప్రజల అందుబాటులో ఉంటాను, బాధ్యతగా పనిచేస్తాను....