manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 3:31 pm Editor : Mana Praja Prathinidhi

నగరం సర్పంచ్ అభ్యర్థిగా కటిక లక్ష్మి అశోక్ నామినేషన్

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట, భూంపల్లిమండలం,                సిద్దిపేట జిల్లా డిసెంబర్ 1
నగరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రముఖ సంఘసేవకుడు కటిక లక్ష్మి అశోక్ నామినేషన్ దాఖలు చేశారు. చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు నగరం గ్రామంలో కటికే లక్ష్మి అశోక్ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సోమవారం పోతారెడ్డి పేట గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్‌ను సమర్పించారు.
ఈ సందర్భంగా కటిక లక్ష్మి అశోక్ మాట్లాడుతూ
“గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు మా లక్ష్యం. ప్రజలు నాపై ఉంచిన విశ్వాసంతో ఈ ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం ఉంది. నాగరంను రాష్ట్రంలో నెంబర్ వన్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దటమే నా కర్తవ్యం.” అని తెలిపారు.
అలాగే, దుబ్బాక నియోజకవర్గం సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, గ్రామంలోని ప్రధాన సమస్యలను ఒక సంవత్సరంలోపే పరిష్కరిస్తానని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఓటుకో నోటుకో లొంగకండి ఓటును నమ్ముకోండి… అమ్ముకోకండి 5 సంవత్సరాలు బానిసలు కాకండి అని ప్రజలకు ఓటు విలువ గురించి విజ్ఞప్తి చేశారు.నామినేషన్ కార్యక్రమంలో ఎల్కపల్లి రాములు, అందె రాజిరెడ్డి, చంద్రమౌళి, రవీందర్ రెడ్డి, ఉతం నరేష్, జీడిపల్లి రమేష్, రాజు, స్వామి, బాబు, బాలరాజ్, బాలు, శ్రీను, బాలయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, గ్రామ పెద్దల సమక్షంలో నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది.