manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 10:59 am Editor : Mana Praja Prathinidhi

ప్రజామౌలిక సదుపాయాలకుబలంతుడా సమావేశంలోకీలకనిర్ణయాలు

మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్7
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) కార్యాలయంలో రెండో బోర్డు సమావేశం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎన్. మౌర్య (ఐఏఎస్)ల అధ్యక్షతన నిర్వహించబడింది.తుడా పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై విభాగాలవారీగా సమగ్ర సమీక్ష చేపట్టారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించే పలు అభివృద్ధి ప్రణాళికలను పరిశీలించి, వాటి అమలుకు అవసరమైన కీలక ఆమోదాలు ఇచ్చారు.తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అభివృద్ధి పనులు సమన్వయంతో, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువుల్లో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పనుల పారదర్శకత, వేగవంతమైన అమలు మరియు శాఖల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలని సూచించారు.వైస్ చైర్మన్ ఎన్. మౌర్య (ఐఏఎస్) ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి, సకాలంలో పూర్తి అయ్యేలా సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు అందజేశారు.ఈ సమావేశంలో తుడా సెక్రటరీ డా. శ్రీకాంత్ బాబు, ఇన్‌చార్జ్ సెక్రటరీ కృష్ణా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవీంద్ర, ప్లానింగ్ ఆఫీసర్ దేవి కుమారి తదితరులు పాల్గొన్నారు.