manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 5:43 am Editor : Mana Praja Prathinidhi

ముస్కాన్ పేట గ్రామం ఏకగ్రీవ సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్8
ముస్కాన్ పేట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకుని, డాక్టర్ జగన్ మోహన్ రావు, డాక్టర్ వీరేష్‌లు ఆయనను శాలువాతో అభినందించి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ“ ముస్కాన్ పేట గ్రామ ప్రజలు చూపిన విశ్వాసం,ప్రేమ,ఆశీర్వాదాలతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రత్యేకంగా డాక్టర్ జగన్మోహన్ రావు గారు నన్ను సత్క రించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అందరి ఆశీర్వాదంతో ముస్కాన్ పేట గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకె ళ్లేందుకు కట్టుబడి పనిచేస్తాను” అని తెలిపారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోతురాజు పర్శరాములు, బాబు సింగ్ తదితరులు పాల్గొన్నారు.