manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 12:16 pm Editor : Mana Praja Prathinidhi

కొత్తపల్లి ప్రభాకర్ నామినేషన్ దాఖలు<br>6వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపిన ప్రభాకర్

మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//.శివయిపల్లి.డిసెంబర్9శివయిపల్లి గ్రామ 6వ వార్డు నుండి మెంబర్ పదవికి కొత్తపల్లి ప్రభాకర్ నేడు అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ“నా వార్డు ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పదవి కోసం నన్ను ముందుకు తీసుకువచ్చి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉండాను.6వ వార్డు అభివృద్ధి కోసం రాత్రి పగలు అన్న భావన లేకుండా అహర్నిశలు కష్టపడి పని చేస్తాను. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా మొదటి లక్ష్యం. దయచేసి ఈ ఎన్నికల్లో నన్ను, కొత్తపల్లి ప్రభాకర్‌ను గెలిపించి ఆశీర్వదించండి. వచ్చే 5 సంవత్సరాలు మీ సేవ కోసం అంకితభావంతో పనిచేస్తాను” అని తెలిపారు.ప్రభాకర్ నామినే షన్ దాఖలు కార్యక్రమానికి స్థానికులు హాజరై ఆయనకు తమ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.