మనప్రజాప్రతినిధి//అక్బర్ పేటభూంపల్లిమండలం,సిద్దిపేట జిల్లా,దుబ్బాక నియోజకవర్గం.అక్బర్ పేటపరిధిలోని భూంపల్లి గ్రామానికి చెందిన పుణ్యమైన కనకరాజు గారి కుటుంబ సభ్యులను దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గార్లు పరామర్శించారు.
నిన్న ఆకస్మికంగా మరణించిన కనకరాజు గారి మరణవార్తపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేతలు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.