ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొడదాం

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబరు 01ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎయిడ్స్ వ్యాధి నివారణపై కీలక సూచనలు చేశారు.డాక్టర్ రజిత మాట్లాడుతూ“ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంపొందించడం ద్వారా మాత్రమే మహమ్మారిని తరిమికొట్టవచ్చు. రక్షణ లేకుండా శారీరక సంబంధం ద్వారా హెచ్ఐవి వ్యాపిస్తుంది. హెచ్ఐవీకి శాశ్వత చికిత్స లేకపోయినా, ART కేంద్రాల్లో అందించే మందులు వాడితే ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించవచ్చు”...