manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 12:25 pm Editor : Mana Praja Prathinidhi

నూతన సంవత్సర వేడుకల్లో శాంతి భద్రతలే లక్ష్యం: మొగుడంపల్లి ఎస్‌ఐ.

సంగారెడ్డి,డిసెంబర్30(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని చిరాగ్‌పల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే. రాజేందర్ రెడ్డి ప్రజలకు సూచించారు.డిసెంబర్ 29న ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణ రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు హైవేలపై, ప్రధాన రహదారులపై కేక్ కటింగ్ చేయరాదని స్పష్టం చేశారు.హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వాహకులు తప్పనిసరిగా నిర్దేశిత సమయపాలన పాటించాలని సూచించారు. ఈవెంట్లలో డ్రగ్స్ లేదా ఇతర నిషేధిత పదార్థాల వినియోగం జరిగితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, భారీ జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, జైలు శిక్ష విధించడం జరుగుతుంద ని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మండలం అంతటా ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించా రు.బైక్ రేసింగ్, అతివేగం, సైలెన్సర్ శబ్దాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వేడుకల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై సీ-టీమ్స్ ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. చివరగా ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరిస్తూ బాధ్యతతో వేడుకలు జరుపుకోవాలని కోరుతూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.