manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 8:59 am Editor : Mana Praja Prathinidhi

మెదక్ జిల్లా: టెక్మాల్ మండలం బర్దిపూర్‌లో దారుణ ఘటనభార్యను హత్య చేసి భర్త ఉరివేసుకుని ఆత్మహత్య

మనప్రజాప్రతినిధి//మెదక్. డిసెంబర్ 2
మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గంగారం శ్రీశైలం (37) తన భార్య మంజుల (34)ను హత్య చేసి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దంపతులకు ఒక కుమారుడు ఉన్నట్లు తెలిసింది.
స్థానికులు ఉదయం ఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.