ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

పాపన్నపేట, డిసెంబర్02(మనప్రజాప్రతినిధి):ఈ నెల 11న జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. మంగళవారం అనంతుని కొత్తపల్లి గ్రామంలోని అనంత పద్మనాభ ఫంక్షన్ హాల్‌లో సమస్యాత్మక గ్రామాలైన శాబాద్ తాండ, సిఎం తాండ, ఎల్లిపేట్, ఎల్పుగొండ గ్రామాలతో పాటు కొత్తపల్లి, అబ్లపూర్, అన్నారం గ్రామాల ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎస్పీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, అధికారుల...