జోగిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహా జన్మదిన వేడుకలు ఘనంగా
మెదక్:మనప్రజాప్రతినిధి//డిసెంబర్5మంత్రి దామోదర్ రాజనర్సింహా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జోగిపేటలో శుక్రవారం వివిధ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి మంత్రిగారి నివాసానికి అభిమానులు, నాయకులు తండోపతండాలుగా తరలి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. వేలాది మంది అభిమానులు వచ్చినప్పటికీ మంత్రి వారందరిని ఓపికగా కలుసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. అభిమానులతో కలిసి భారీ కేక్‌ను కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.తరువాత జోగిపేట పట్టణంలో పర్యటించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా, కస్తూరిబా బాలికల వసతి శాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేజీబీవీ, నర్సింగ్ విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు....