మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.డిసెంబర్7
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు స్వామిను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన నూతన ఏఎంసీ చైర్మన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు మంత్రి గారిని కలిసి, సంప్రదాయ పద్ధతిలో కలంకారీ వస్త్రంతో ఘన సత్కారం నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థప్రసా దాలు అందజేస్తూ ప్రాంతీయ రైతుల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.అలాగే వేంకటగిరి ఏఎంసీ చైర్మన్ విశ్వనాధం కూడా మంత్రి బాల వీరాంజనేయులు స్వామిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు పంచుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయులు స్వామి మాట్లాడుతూ “రైతుల సంక్షే మంకోసం ఏఎంసీ చైర్మన్లు కీలకపాత్ర పోషించాలి. మీరిరువురి నియామకం రైతాంగానికి మరింత బలం కలిగిస్తుంది” అని నూతన చైర్మన్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.