manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 7:47 am Editor : Mana Praja Prathinidhi

ఏపీ సీఎం ప్రశంసలు అందుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం,డిసెంబర్ 5
శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆలయ పనితీరు సర్వేలో టాప్ ర్యాంక్ సాధించింది. తిరుమల మినహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రముఖ దేవాలయాల మధ్య జరిగిన ఈ మూల్యాంకనంలో శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం 72.7% భక్తుల సంతృప్తితో మొదటి స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఆలయ అభివృద్ధి, భక్తుల సదుపాయాల పెంపుకు కృషి చేసిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాత్రను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే ఇచ్చిన సమగ్ర సూచనలు, ముందస్తు ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ ఈ విజయానికి కారణమని సీఎం పేర్కొన్నారు.భక్తుల సేవల్లో గతేడాదితో పోలిస్తే భారీ మార్పు వచ్చినట్టు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ సిబ్బంది సేవలు కూడా బొజ్జల సుధీర్ రెడ్డి నాయకత్వంలో ఆదర్శప్రాయంగా మారాయని స్థానికులు తెలిపారు