ఇంటింటికే వెళ్లి పింఛన్లు అందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 1తుఫాను పరిస్థితుల్లోనూ సేవలో ముందుండటం ప్రజల్లో హర్షంశ్రీకాళహస్తి మండలం ఉరందూరు పంచాయతీలో సోమవారం ఉదయం ప్రత్యేక కార్యక్రమంగా శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేయడం స్థానిక ప్రజల్లో విశేష ఆనందాన్ని కలిగించింది.తుఫాను పరిస్థితుల కారణంగా పలుచోట్ల నిత్యజీవితంలో అంతరాయం ఏర్పడినప్పటికీ, పింఛన్లు సమయానికి అందాలనే ప్రభుత్వ సంకల్పం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ప్రజాప్రతిబద్ధతను నిలబెట్టే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం గమనార్హమని స్థానికులు అభినందించారు.ఎమ్మెల్యే బొజ్జల...