ఇల్లంతకుంట మండలంలో పలు గ్రామాల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 22ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామపంచాయతీల నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల...