manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 6:16 pm Editor : Mana Praja Prathinidhi

కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఎంపీ రఘునందన్ రావు

మనప్రజాప్రతినిధి//కొమురవెల్లి.జనగామ నియోజకవర్గం.డిసెంబర్14
జనగామ నియోజకవర్గంలోని కొమురవెల్లి మండల కేంద్రంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న కొమురవెల్లి పుణ్యక్షేత్ర రైల్వే స్టేషన్‌ను మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా స్టేషన్‌లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ అనంతరం మీడియాతోమాట్లాడుతూ, గత సంవత్సరం ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన ఈ రైల్వే స్టేషన్‌ను కేవలం పద్దెనిమిది నెలల్లోనే పూర్తి చేయడం ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఇంత వేగంగా పనులు పూర్తి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.వచ్చే నెలలో కొమురవెల్లి శ్రీ మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే స్టేషన్‌ను వీలైనంత త్వరగా ప్రారం భించేలా రైల్వే మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.