మనప్రజాప్రతినిధి//ఇర్కోడ్. సిద్దిపేటనియోజకవర్గం.డిసెంబర్ 2
ఇర్కోడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో 6వ వార్డు సభ్యునిగా పోటీకి సిద్ధమైన యువకుడు కుచ్చుల తిరుపతి మంగళవారం నాడు అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు.
సమాజ సేవనే ధ్యేయంగా పెట్టుకున్న తిరుపతి, గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తానని తెలిపారు. పారిశుధ్యం, తాగునీటి సమస్యలు, అందుబాటులో లేని ప్రాథమిక సౌకర్యాలు వంటి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని చెప్పారు.
“ప్రజల మధ్యనే ఉంటూ వారికి అందుబాటులో ఉండటమే నా రాజకీయ ధోరణి. పేదప్రజలకుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తాను. ప్రణాళికలతో ఉన్న పాలకులను ఎన్నుకోండి, ప్రశ్నించే ధైర్యాన్ని అలవాటు చేసుకోండి, మీ సమస్యలను మీరు ముందుకు వచ్చి చెప్పండినేను మీతో ఉంటాను” అని కుచ్చుల తిరుపతి పేర్కొన్నారు.