సమాజసేవేలక్ష్యంగాముందుకుకుచ్చులతిరుపతి 6వవార్డ్‌లోనామినేషన్
మనప్రజాప్రతినిధి//ఇర్కోడ్. సిద్దిపేటనియోజకవర్గం.డిసెంబర్ 2ఇర్కోడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో 6వ వార్డు సభ్యునిగా పోటీకి సిద్ధమైన యువకుడు కుచ్చుల తిరుపతి మంగళవారం నాడు అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు.సమాజ సేవనే ధ్యేయంగా పెట్టుకున్న తిరుపతి, గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తానని తెలిపారు. పారిశుధ్యం, తాగునీటి సమస్యలు, అందుబాటులో లేని ప్రాథమిక సౌకర్యాలు వంటి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని చెప్పారు.“ప్రజల మధ్యనే ఉంటూ వారికి అందుబాటులో ఉండటమే నా రాజకీయ ధోరణి....