అమావాస్య పర్వదినాన ఎల్లమ్మ తల్లి సారే… గురు శక్తి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ఇరుముడి కార్యక్రమం

మనప్రజాప్రతినిధి.ఏర్పేడుమండలం.డిసెంబర్19తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని ఏర్పేడు గ్రామంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఓం శక్తి మాల ధరించిన భక్తులు ఎల్లమ్మ తల్లికి సారే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంతో గ్రామమంతా భక్తి శ్రద్ధలతో పరవశించింది.ఇటీవల ఓం శక్తి మాల వేసుకున్న భక్తులు అమావాస్యను మహా పవిత్ర దినంగా భావించి తెల్లవారుజామున నుంచే గ్రామంలో వెలసిన ఎల్లమ్మ తల్లి ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సారే సమర్పణలతో తల్లిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుల మేళాలు,...