manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 5:49 pm Posted by : Mana Praja Prathinidhi

ఓటరు ఓటు విలువ తెలుసుకున్నప్పుడే<br>నైతిక విలువలు కాపాడిన వారు అవుతార ముస్త్యాల యాదగిరి

మనప్రజాప్రతినిది//కొండపాక మండలం.డిసెంబర్12
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుల, మత, పార్టీ భేదాలు పక్కనపెట్టి సేవాభావం కలిగిన, నీతి–నిజాయితీ గల అభ్యర్థులనుఎన్నుకోవాలని సామాజిక కర్త ముస్త్యాల యాదగిరి శుక్రవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇంతకుముందు డబ్బు, మద్యం పంచి గెలిచిన వారుఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చులను తిరిగి సంపాదించుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.  ఈ పరిస్థితుల వల్ల గ్రామాల అభివృద్ధి తీవ్రంగా
కుంటుపడుతుందని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల్లో డబ్బు–మద్యం పంచడం ప్రజాస్వామ్యాన్ని దిగజార్చే చర్య అని, ఇది రాజకీయ నైతిక విలువలకు పాతర వేసినట్టేనని స్పష్టం చేశారు.
సేవాభావం గల, ప్రజల సమస్యలను ప్రశ్నించి పరిష్కారాలు తీసుకురా గలిగే, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల నుండి గ్రామాభివృద్ధి నిధులు తెచ్చే సామర్థ్యమున్న నిజమైన నేతలకు ఓటర్లు పట్టం కడితేనే గ్రామం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆయన అన్నారు.
అప్పుడు మాత్రమే మహాత్మా జ్యోతిబా పూలే,డాక్టర్ బి.ఆర్. అంబేద్క ర్ ఆశయాలు నెరవేరుతాయని ముస్త్యాల యాదగిరి పేర్కొన్నారు.