ఓటరు ఓటు విలువ తెలుసుకున్నప్పుడే<br>నైతిక విలువలు కాపాడిన వారు అవుతార ముస్త్యాల యాదగిరి
మనప్రజాప్రతినిది//కొండపాక మండలం.డిసెంబర్12గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుల, మత, పార్టీ భేదాలు పక్కనపెట్టి సేవాభావం కలిగిన, నీతి–నిజాయితీ గల అభ్యర్థులనుఎన్నుకోవాలని సామాజిక కర్త ముస్త్యాల యాదగిరి శుక్రవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇంతకుముందు డబ్బు, మద్యం పంచి గెలిచిన వారుఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చులను తిరిగి సంపాదించుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల వల్ల గ్రామాల అభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతుందని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల్లో డబ్బు–మద్యం పంచడం ప్రజాస్వామ్యాన్ని దిగజార్చే చర్య అని, ఇది...