కేసు నమోదు,వెంటనే అరెస్ట్-రిమాండ్ కి తరలింపు
మనప్రజాప్రతినిధి//అక్బర్పేట్,భూంపల్లిమండల్,సిద్దిపేటజిల్లా
దుబ్బాకసీఐ పాలెపుశ్రీనివాస్.అక్బర్పేట్ భూంపల్లి ఎస్సై హరీష్ గౌడ్ తెలిపారు, రహదారిపై వడ్ల సంచులు నిర్లక్ష్యంగా ఉంచడంతో ఒక వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.శనివారం అక్బర్ పేట్ భూంపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.ఈనెల 12వ తేదీన కాజీపూర్ గ్రామానికి చెందిన గజాబింకర్ ఈశ్వర్ లాల్ (48) రాత్రి 9:30కి ద్విచక్ర వాహనంపై అక్బర్ పేటుకు వస్తుండగా, భూంపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో రహదారిపై నలుపు రంగు ప్లాస్టిక్ కవర్లతో కప్పబడిన వడ్ల సంచులను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు, రహదారిపై వడ్ల సంచులను నిర్లక్ష్యంగా ఉంచినందుకు కాపర్ల మైసయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి, శనివారం రిమాండ్ కి తరలించినట్లు అధికారులు తెలిపారు.ఈ సమావేశంలో భూంపల్లి ఎస్సై హరీష్ గౌడ్ తదితర అధికారులు కూడా పాల్గొన్నారు.