పాపన్నపేట//డిసెంబర్5(మనప్రజాప్రతినిధి)
మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా సైన్స్ ఫెయిర్‌లో పాపన్నపేట మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రతిభ మెరిపించింది. ఈ పాఠశాల నుండి మొత్తం నాలుగు ఎగ్జిబిట్లు ప్రదర్శించగా, వాటిలో రెండు ప్రాజెక్టులు జిల్లాస్థాయిలో బహుమతులు సాధించి పాఠశాల ప్రతిష్టను నిలబెట్టాయి.
జూనియర్ విభాగంజనాత్మక గణిత నమూనావై.అభిలాష్ జిల్లాస్థాయిలో రెండవ బహుమతి గెలుచుకోగా, గైడ్ టీచర్‌గా ఎస్. రవికాంత్ మార్గనిర్దేశం చేశారు.సీనియర్ విభాగం హెల్త్ అండ్ హైజిన్ఎం. దీక్షిత జిల్లాస్థాయిలో రెండవ బహుమతి సాధించగా, గైడ్ టీచర్‌గా ఇందిరా పనిచేశారు.ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజలు విద్యార్థులను అభినందించారు.