manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 8:30 am Editor : Mana Praja Prathinidhi

జంగాపల్లిగ్రామసర్పంచిగాపాతూరిలావణ్య నర్సింహారెడ్డి ఏకగ్రీవం

మనప్రజాప్రతినిధి//అక్బర్ పేటభూంపల్లిమండలం,దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా.డిసెంబర్4
అక్బర్ పేటభూంపల్లి మండల పరిధిలోని జంగాపల్లి గ్రామ సర్పంచ్‌గా పాతూరి లావణ్య నర్సింహారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే గ్రామంలోని 10 వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం కావడంతో గ్రామంలో ఆనందం నెలకొంది.
మీడియా సమావేశంలో సర్పంచ్ లావణ్య నర్సింహారెడ్డి మాట్లాడుతూ“గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. ప్రతి సమస్యను గ్రామస్తులతో కలిసి పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. గ్రామ ప్రజలు నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతను నిబద్ధతగా నిర్వర్తిస్తాం.” అని ప్రకటించారు.ఆమె ఇంకా గ్రామంలో ఉన్న సమస్యలను క్రమంగా గుర్తించి, ప్రతి కుటుంబం మరియు ప్రతి వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులు
1. కర్ల బిక్షపతి
2. సుజాత
3. దేవేందర్ రెడ్డి
4. రామగాళ్ల స్వామి
5. లాలు ప్రసాద్ గౌడ్
6. వరలక్ష్మి
7. నాగరాజు
8. జ్యోతి బాబు
9. గీత
10. ఊర్మిళ
సర్పంచ్ లావణ్య నర్సింహారెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తామని, అభివృద్ధి పంథాలో జంగాపల్లిని ముందుకు తీసుకెళ్తామని విజ్ఞప్తి చేశారు.