మనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లా.అక్బర్‌పేట–భూంపల్లి:డిసెంబర్28
మండల ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిన ప్రజల నాయకుడు, సేవా భావంతో ముందుకు సాగే వ్యక్తి పల్లె సుధాకర్ (లెజెండ్) అక్బర్‌పేట–భూంపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రజల మధ్యే ఉండి, ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా ఆయనకు మండలవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన పల్లె సుధాకర్ ప్రజాసేవే ధ్యేయంగా రాజకీయ రంగంలోకి వచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ… దుబ్బాక నియోజకవర్గ నాయకుల అండదండలు, మండల నాయకులు, కార్యకర్తల సహకారంతో ప్రతి గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.ప్రతి గ్రామంలో ప్రజలతో నేరుగా మమేకమై, సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కారం చూపిస్తానని తెలిపారు. గ్రామాభివృద్ధి మాటల్లో కాదు – పనుల్లో కనిపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నానని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.ఎల్లవేళలా ప్రజలకు అండగా నిలవడమే తన ఆశయమని, ప్రజల సేవలో ఉండటం వల్లే తాను సంతృప్తి పొందుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచీ కొనసాగుతున్న వ్యక్తిగా పల్లె సుధాకర్‌కు ప్రజల్లో అపారమైన అభిమానం ఉందని మండల నాయకులు పేర్కొన్నారు.గ్రామాభివృద్ధి కావాలంటే ప్రజల నమ్మకం ఉన్న నాయకుడికి అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం మండల ప్రజల్లో వ్యక్తమవుతోంది.