manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 3:55 pm Editor : Mana Praja Prathinidhi

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ‘ఫోన్–ఇన్’ కార్యక్రమం వాయిదా

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం. డిసెంబర్12
సామాన్య ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం కోసం ప్రతి శనివారం నిర్వహించే “పోలీస్ కమీషనర్‌ తో ఫోన్–ఇన్ కార్యక్రమం” ఈ వారం జరగదు.రాష్ట్రంలోజరుగుతున్న రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, ఈ శనివారం (13 డిసెంబర్, 2025) నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసిన ట్లు కమీషనర్ విజయ్ కుమార్, ఐపిఎస్ ప్రకటించారు.ప్రజలు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని ఆయన కోరారు.తదుపరి “ఫోన్–ఇన్” కార్యక్రమం 20 డిసెంబర్, 2025 (శనివారం) న యథావిధిగా జరుగుతుందని తెలిపారు.