ఇరుకోడుగ్రామంలోపోలీస్ ఫ్లాగ్ మార్చ్ శాంతిభద్రతలపైపటిష్టచర్యలు

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లా,రూరల్ డిసెంబర్7సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని ఇరుకోడు గ్రామంలో శాంతి భద్రతలను బలోపేతం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం సిద్దిపేట రూరల్ సీఐ యం. శ్రీను, ఎస్ఐ కే. రాజేష్ మరియు ఆర్‌ఎస్‌ఐ బేటా లియా నాయకత్వంలో సాగింది.గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు, సున్నిత ప్రాంతాల్లో పోలీసులు పర్యటిస్తూ ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,...