manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 5:12 am Editor : Mana Praja Prathinidhi

ఎన్నికల ర్యాలీలకు పోలీసుల అనుమతి తప్పనిసరి: గజ్వేల్ ఏసీపీ నర్సింహులు

మనప్రజాప్రతినిధి//కొండపాక (కుకునూరుపల్లి)డిసెంబర్ 2
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా ర్యాలీలు, సభలు లేదా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా పోలీసు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు సూచించారు. కొండపాక, కుకునూరుపల్లి మండలాలకు చెందిన రాజకీయ నాయకులతో సోమవారం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమావేశంలో గజ్వేల్ ఏసీపీతో పాటు తొగుట సీఐ లతీఫ్, ఎస్‌ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి (MCC – Model Code of Conduct) అమల్లో ఉన్నందున ప్రతి ర్యాలీ, మీటింగ్, ప్రచార కార్యక్రమానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, అనుమతి లేకుండా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.అధికారులు మాట్లాడుతూప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు ఎటువంటి అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడకూడదనిగ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని వివరించారు.ఇక ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, పోలీసుల సూచనలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలనివారుసూచించారు.మొత్తంగా, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే ఎవరిపై అయినా చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు మరోసారి స్పష్టంచేశారు.