ఎన్నికల ర్యాలీలకు పోలీసుల అనుమతి తప్పనిసరి: గజ్వేల్ ఏసీపీ నర్సింహులు

మనప్రజాప్రతినిధి//కొండపాక (కుకునూరుపల్లి)డిసెంబర్ 2గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా ర్యాలీలు, సభలు లేదా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా పోలీసు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు సూచించారు. కొండపాక, కుకునూరుపల్లి మండలాలకు చెందిన రాజకీయ నాయకులతో సోమవారం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.సమావేశంలో గజ్వేల్ ఏసీపీతో పాటు తొగుట సీఐ లతీఫ్, ఎస్‌ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి (MCC – Model Code of Conduct) అమల్లో ఉన్నందున ప్రతి ర్యాలీ, మీటింగ్, ప్రచార కార్యక్రమానికి తప్పనిసరిగా...