manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 5:42 pm Editor : Mana Praja Prathinidhi

గ్రామాల్లో రాజకీయ పేలుడు!

ఎవరిదిగ్రామం?చివరిముద్రమాత్రంఓటరుదే
మనప్రజాప్రతినిధి // కొండపాక(కుకునూరుపల్లి)మండలం
పల్లెల్లో రాజకీయాలు కాసేపట్లో చిచ్చరపిడుగు అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల గడప చేరుతుండటంతో… పల్లె రాజకీయాల్లో వేడి ఒక్కసారిగా ఎన్నిఎగిసింది. ప్రతి పార్టీప్రతి అభ్యర్థి గ్రామాన్ని అధిరో హించాలన్న కసితో పావులు కదుపుతుండటంతో… పల్లె పల్లెల్లో రాజకీయ వాతావరణం ఝులుపిస్తుంది.పార్టీల పంజా పల్లెల్లో అగ్గిరాజకీయాలుసర్పంచ్, వార్డు సభ్యత్వం వంటి స్థానాలు ప్రతిష్టాత్మకంగా మారడంతో పార్టీలు కూడా బరిలో దూకుడుమీద దూకుడుగా అడుగులు వేస్తున్నాయి.అభ్యర్థుల ఎంపికలో ఇప్పుడు ఒకేప్రశ్న:“ఎన్నిఓట్లుతెస్తావ్?ఎంతఖర్చుచేస్తావ్?”కార్యకర్తలు,స్థానిక నాయకులు తమ బలం-దౌర్భల్యాలు లెక్కపెట్టుకుంటూ అంతర్గత పావులాటలో నిమగ్నమయ్యారు.సామాజిక సమీకరణాలు, స్థానిక సమస్యలు… అన్నీ పక్కన పడిపోయి డబ్బు పెట్టుబడే ప్రధాన ప్రమాణంగా మారింది.అధికార పార్టీలో పావులాట పీక్అధికార పార్టీ శిబిరంలో అయితే పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది.తమకు అనుకూల అధికారులను గ్రామాల్లో కొనసా గించేందుకు ఒత్తిడులు పెరుగుతున్నాయన్న చర్చలు గ్రామాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. తమకు వ్యతిరేకంగా పనిచేసే నాయకులపై ఒత్తిడి, బాధ్యతలు మార్పుల మాటలు కూడా పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.వ్యవస్థ ఈఒత్తిడులకు తలవంచుతోందా? అనేది ఇప్పుడు పల్లె పల్లెల్లో చర్చ.విపక్షం బలహీనత ఉన్నా వ్యతిరేకత మాత్రం బలమైనదే బీఆర్ఎస్ – కార్యకర్తలు ఆర్థికంగా కాస్త వెనుకబడి కనిపిస్తున్నా, కొన్ని గ్రామాల్లో జోరు ఇంకా కనిపిస్తూనే ఉంది.బీజేపీ – పల్లె స్థాయిలో ప్రాబల్యం ఇంకా పెద్దగా పెరగలేదు.కాంగ్రెస్-ఇంద్రమ్మ ఇళ్లు, రేషన్, ఆరోగ్యం ఇలాంటి పథకాల పేరిట గ్రామాల్లో వేగంగా పట్టు సాధిస్తోంది. పథకాల చర్చ ప్రజల్లో విస్తృతంగా వినిపిస్తోంది.పల్లె మనసు“మాకు పార్టీ కాదు…పని చేసే మనిషి కావాలి”పల్లె ఓటరు మాత్రంఇప్పటికీ మౌనంగానే ఉన్నాడు.రాజకీయగందరగోళం, డబ్బు ఓట్లు ఆట… ఇవన్నీ చూస్తూ నిరాశతో ఉన్నా, తన ఓటు విలువబాగాతెలుసు. పార్టీలకుకాదుతనసమస్యలనుపరిష్కరించే నిష్ఠ ఉన్న వ్యక్తికే ఓటు వేయాలనేది పల్లె మనసు.కానీ పార్టీల దృష్టిలో మాత్రం ఇంకా “నోట్లు–ఓట్లు” ఫార్ములా అగ్రస్థానంలోనే ఉంది.చివరి మాట…ఒడిసెలు అందుకునేది “గుడి”సె ఓటరే!పార్టీలు పావులు కదుపుతూనే ఉంటాయి…నాయకులు లెక్కలు వేసుకుంటూనే ఉంటారు…కానీ ఎవరి పతాకం గ్రామంలో ఎగురు తుందో అని నిర్ణయించేది చివరకు గుడిసెలో కూర్చున్న ఓటరే!