manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 9:47 am Posted by : Mana Praja Prathinidhi

ప్రజాసేవయే లక్ష్యంచిల్వర్‌లో కాంగ్రెస్ సర్పంచ్అభ్యర్థిశశిధర్ రెడ్డిదూసుకుపోతున్నప్రచారం

మెదక్ జిల్లా. మనప్రజాప్రతినిధి//డిసెంబర్7అల్లాదుర్గం మండలం.చిల్వర్
చిల్వర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముక్కెర శశిధర్ రెడ్డి ప్రచారం జోరుగా కొనసాగుతోంది. “ప్రజలే నా బలం – ప్రజాసేవయే నా లక్ష్యం” అనే నినాదంతో ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.గ్రామ అభివృద్ధే ధ్యేయంగా, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, విద్యుత్ దీపాలు, ప్రభుత్వ పాఠశాలల సమస్యలు, ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్యశ్రీ  సీఎం ఆర్ఎఫ్ సహాయం వంటి అంశాలపై స్పష్టమైన ప్రణాళికతో పనిచేస్తా నని హామీ ఇస్తున్నారు.శశిధర్ రెడ్డి గారు కుల, మత, వర్గభేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా చూసే నాయకుడని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. గ్రామ నిధులను నిజాయి తీగా వినియోగిస్తూ, వ్యక్తిగత ప్రయోజనాలకన్నా ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తారని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తు న్నారు.గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటూ, “కత్తెర గుర్తుకు ఓటు వేసి ముక్కెర శశిధర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దాంచిల్వర్‌ను అభివృద్ధి బాటలో నడిపిద్దాం” అంటూ నినాదాలు చేస్తున్నారు.మీ ఓటే గ్రామ భవిష్యత్తుసరైన నాయకుణ్ని ఎన్నుకుందాం అని గ్రామ ప్రజలు పిలుపునిస్తున్నారు.