manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 3:04 pm Editor : Mana Praja Prathinidhi

నిరుపేద కుటుంబానికి అండగా ఆకారం శివకుమార్

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్29
మర్పడగా గ్రామానికి చెందిన శనిగారం బాలరాజావ్వ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న ఆకారం శివకుమార్ మానవతా దృక్పథంతో స్పందించారు.మృతురాలి కుటుంబానికి అండగా నిలిచి తన వంతు సహాయంగా 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవసరంలో ఉన్న వారికి తోడుగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట చిల్లపురం వెంకటేష్, కస వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.