మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్19
మహాత్మా గాంధీ పేరిట గ్రామీణ ప్రజల ఆర్థిక అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గ్రామీణ ప్రధాని రాజు కార్యక్రమం నుంచి గాంధీ పేరు తొలగించి మరో పేరును ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తిరుపతి సిటీ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు.ఈ నిర్ణయానికి నిరసనగా తిరుపతి నగరంలో కాంగ్రెస్ నాయకులు కళ్లకు గంతలు కట్టి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి సిటీ కాంగ్రెస్ నేతలు చిట్టిబాబు, తమటం వెంకటేశ్వర్లు, జ్యోతి స్వరూప్ నాయక్, ఎన్‌ఎస్‌సీఐ జిల్లా అధ్యక్షులు నరేంద్ర, సుప్రజ దేవరాజ్ తదితరులు నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎక్స్ బీసీ సెల్ చైర్మన్ చిరంజీవి ప్రసంగిస్తూ మాట్లాడుతూ-దేశ స్వాతంత్ర్యానికి తన ప్రాణాలను అర్పించి, సత్యం–అహింస అనే మార్గంతో భారతదేశానికి స్వేచ్ఛను సాధించిన మహాత్మా గాంధీ పేరును తొలగించడం చరిత్రను వక్రీకరించడమేనన్నారు. గాంధీ పేరు తొలగించి పొందుతున్న ఆనందం శాశ్వతం కాదని, ప్రజలు ఈ నిర్ణయాన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో ఎంపీగా గెలిచినప్పటికీ, స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో విజయాన్ని సాధించలేకపోవడానికి ఇలాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ప్రధాని రాజు పథకం పేరును యథాతథంగా కొనసాగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు, పోలీస్ శాఖకు చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాకుండా “జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ – జైహింద్” నినాదాలతో కార్యక్రమం ముగిసింది.