మహాత్మా గాంధీ పేరును తొలగించడం దేశద్రోహం-కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నిరసన దీక్ష
సంగారెడ్డి, డిసెంబర్21(మనప్రజాప్రతినిధి)పనికి ఆహార పథకం పేరులో నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరు తొలగించిన కేంద్ర బీజేపీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంజి మైదాన్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం దీక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్‌పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహాత్మా గాంధీ పేరు తొలగించడం వెనుక బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. దేశ స్వాతంత్య్రం కోసం...