మనప్రజాప్రతినిధి//చేర్యాల. డిసెంబర్1.
సిద్దిపేటజిల్లా చేర్యాల సమీప ప్రాంతంలోని గురజగుంట క్రాస్ వద్ద ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నంగి చంద్రయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే…
వాహనాల ఢీతో చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇంకా వివరాలు త్వరలో..