manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 11:37 am Editor : Mana Praja Prathinidhi

రోడ్డుభద్రతపైఅవగాహనసదస్సుపోలీస్ సిబ్బందికిహెల్మెట్ల పంపిణీ

మనప్రజాప్రతినిధి//రేణిగుంట మండలం.డిసెంబర్7
తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు గాజులమండ్యం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ రెడ్డి పోలీస్ సిబ్బందికి 36 హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పోలీస్ స్టాఫ్ వెల్ఫేర్‌లో భాగంగా, అలాగే రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహించారు.ఈ సందర్భంగా రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఈ నిబంధనలను ముందు వరుసలో నిలబడి పోలీసులు అమలు చేయాలని సూచించారు. హెల్మెట్ల పంపిణీ ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, భద్రతా నియమాల పాటింపును పెంపొందించడం లక్ష్యమని వివరించారు.రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజలు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలను పాటిస్తూ సురక్షిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.పోలీస్ శాఖరేణిగుంట సబ్ డివిజన్ తిరుపతి జిల్లా