వాహనాల తనిఖీల్లో రూ.5.97 లక్షల నగదు స్వాధీనం

మెదక్, డిసెంబర్10(మన ప్రజా ప్రతినిధి)అల్లాదుర్గం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోకఠినంగాకొనసాగుతున్న తనిఖీల్లో ఎఫ్‌ఎస్‌టి అధికారులు భారీ మొత్తం నగదును స్వాధీనం చేశారు. మంగళవారం రాత్రి అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామంబ్యాంక్ఏరియావద్దనిర్వహించిన వాహనాల తనిఖీలలో రూ. 5 లక్షల 97 వేల నగదు పట్టుబడింది. ఎఫ్‌ఎస్‌టి సిబ్బంది మహేష్‌కుమార్, ఏఎస్ఐ గాలయ్య పర్యవేక్షణలో జరిగిన తనిఖీల్లో బీహార్‌కు చెందిన వితిన్ రోహన్ రాజ్ నగదును తీసుకెళ్తుండగా ఆపి వివరాలు సేకరించారు. సరైన పత్రాలు లేకపోవ డంతో నగదును స్వాధీనం చేసి అల్లాదుర్గం పోలీసులకు అప్పగించా రు.స్థానిక...