నాగ్సంపల్లి గ్రామంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డిజిల్లా.డిసెంబర్21(మనప్రజాప్రతినిధి)సదాశివపేట మండలంలోని నాగ్సంపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కాశీపురం రవికుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని ఎల్లమ్మ తల్లి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సంగారెడ్డి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని గ్రామం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండాలని దేవతలను ప్రార్థించారు. గ్రామ ప్రజలను అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని మొక్కుకున్నారు.గ్రామంలోకి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రవేశించిన సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున భాజా భజంత్రీలు, డప్పు జప్పులతో ఘన స్వాగతం పలికారు....