manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 3:47 pm Posted by : Mana Praja Prathinidhi

యువజన సంఘం మద్దతు కోరిన సర్పంచ్ అభ్యర్థి కాసుపాక శంకర్

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 12
ఇల్లంతకుంట మండలంలోని పాటిమీద ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాసుపాక శంకర్ యువజన సంఘ సభ్యులను కలిసారు. యువత మద్దతు తమకు అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, గ్రామ అభివృద్ధిలో యువతను భాగస్వాములుగా చేసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యువకుల అభ్యున్నతి కోసం ఉద్యోగఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో యువతకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని అన్నారు.ఇల్లంతకుంట సర్పంచ్ అభ్యర్థిగా కాసుపాక శంకర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు, ముఖ్యంగా యువతకు శంకర్ విజ్ఞప్తి చేశారు.