మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 02
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఇల్లంతకుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కాసుపాక శంకర్ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని వేగవంతం చేశారు. గ్రామంలోని అన్ని కుల సంఘాలు, యువజన సంఘాలు, వివిధ వర్గాల ప్రజలను కలిసి తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరారు.గ్రామ ప్రజలతో మాట్లాడుతూ,“ఈసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇల్లంతకుంట గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. ప్రజల ఆశలను నెరవేర్చే పాలన అందిస్తాను” అని శంకర్ హామీ ఇచ్చారు.ఇల్లంతకుంట సర్పంచ్ పదవికి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని గ్రామ ప్రజలను మనవి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.