manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 7:12 pm Editor : Mana Praja Prathinidhi

అనంతారం గ్రామ ప్రజలు ఆదరించాలని సర్పంచ్ అభ్యర్థి ఓల్లాల రేఖ విజ్ఞప్తి<br>

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్12
ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ఓల్లాల రేఖ గ్రామ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రజలతో సమావేశమయ్యారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబా టులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.ప్రచార సమావేశంలో మాట్లాడిన రేఖ, గ్రామంలో మరణిం చిన కుటుంబాలకు ₹5,000 ఆర్థిక సహాయం, పుట్టిన ఆడబిడ్డలకు ₹2,000 ఫిక్స్‌డ్ డిపాజిట్, అలాగే ఎల్లమ్మ పోచమ్మ గుడి వరకు కరెంట్ పోల్స్ ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.గ్రామ అభివృద్ధి కోసం అన్ని కుల సంఘాల ఐక్యత అవసర మని పేర్కొన్న రేఖ, ప్రజలందరి మద్దతును కోరారు. అవస రాన్ని వివరించిన ఆమెకు “ఎన్నికల సంఘం కేటాయించిన కత్తెర గుర్తు కు మీఅమూల్యమైన ఓటును వేసి, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి” అని గ్రామ ప్రజలను అభ్యర్థించారు.